Types of Triangles Telugu – త్రిభుజముల రకాలు

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో వివిధ రకాల Triangles ( త్రిభుజాలు ) గురించి డిస్కస్ చేసుకుందాం. 

వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

Triangles భుజాన్ని బట్టి 3 రకాలు, కోణాన్ని బట్టి 3 రకాలు. 

Side ని తెలుగులో భుజం అంటారు. Angle ని తెలుగులో కోణం అంటారు. 

Types of Triangle based on Side

Sideని బట్టి Triangles మూడు రకాలు. అవి Equilateral Triangle, Isosceles Triangle and Scalene Triangle.

Equilateral Triangle:

దీనిని తెలుగులో సమబాహు త్రిభుజం అంటారు. 

ఈ త్రిభుజం లో మూడు భుజాలు సమానంగా ఉంటాయి. 

Example: AB = BC = CA = 5cm

Isosceles Triangle:

దీనిని తెలుగులో సమద్విబాహు త్రిభుజం అంటారు. 

ఈ త్రిభుజం లో రెండు భుజాలు సమానంగా ఉంటాయి.

Example: AB= BC = 5cm, CA = 4cm

Isosceles Triangle

దీనిని తెలుగులో విషమబాహు త్రిభుజం అంటారు. 

ఈ త్రిభుజం లో మూడు భుజాల పొడవులు సమానంగా ఉండవు. 

Example: AB = 3cm, BC = 4cm, CA = 5cm.

Types of Triangle based on Angle

Angle ని బట్టి Triangles మూడు రకాలు. అవి Acute-angled Triangle, Right angled Triangle and Obtuse-angled Triangle.

Acute-angled Triangle:

దీనిని తెలుగులో అల్పకోణ  త్రిభుజం అంటారు.

ఈ త్రిభుజంలో మూడు కోణాలు 90 degrees కంటే తక్కువగా ఉంటాయి. 

Example: angle A = 40 degrees, angle B = 80 degrees, angle C = 60 degrees. 

Right-angled Triangle:

దీనిని తెలుగులో లంబకోణ  త్రిభుజం అంటారు.

ఈ త్రిభుజంలో ఒక కోణం 90 degrees ఉంటుంది. 

Example: angle A = 40 degrees, angle B = 90 degrees, angle C = 50 degrees. 

Obtuse-angled Triangle:

దీనిని తెలుగులో అధికకోణ  త్రిభుజం అంటారు.

ఈ త్రిభుజంలో ఒక కోణం 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది. 

Example: angle A = 30 degrees, angle B = 100 degrees, angle C = 50 degrees.

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top