ఈ రోజు ఆర్టికల్ లో మనం Scalene Triangle కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Scalene Triangle ను తెలుగులో విషమ బాహు త్రిభుజం అంటారు.
భుజాన్ని బట్టి త్రిభుజాలు మూడు రకాలు.
సమ బాహు త్రిభుజం , సమద్వి బాహు త్రిభుజం మరియు విషమ బాహు త్రిభుజం.
సమ బాహు త్రిభుజం లో మూడు భుజముల పొడవులు సమానంగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజం లో రెండు భుజముల పొడవులు సమానంగా ఉంటాయి.
విషమ బాహు త్రిభుజంలో మూడు భుజాల పొడవులు విభిన్నంగా ఉంటాయి.
ఒక త్రిభుజం లో మూడు భుజాల పొడవులు విభిన్నంగా ఉంటే ఆ త్రిభుజాన్ని విషమ బాహు త్రిభుజం అని అంటారు.
విషమ బాహు త్రిభుజం లో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు.
విషమ బాహు త్రిభుజం యొక్క Perimeter = a+b+c
విషమ బాహు త్రిభుజం యొక్క Area = ½*bh
Some Problems on Scalene Triangle in Telugu
Q: ఒక విషమ బాహు త్రిభుజం లో భుజాలు 3, 4, 5 యూనిట్స్ అయినా ఆ త్రిభుజ చుట్టుకొలత కనుగొనండి.
Ans : విషమ బహు త్రిభుజ చుట్టుకొలత = 3+4+5 = 12 యూనిట్స్
Q: ఒక విషమ బాహు త్రిభుజం లో కోణములు 60, 70 డిగ్రీలు అయినా మూడవ కోణం యొక్క విలువ కనుగొనుము?
Ans: విషమ బాహు త్రిభుజం లో మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలు
మూడవ కోణం యొక్క విలువ = 180-60-70 = 50 డిగ్రీలు
Q : ఒక విషమ బాహు త్రిభుజం లో బేస్ విలువ 10 units , height విలువ 8 units అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంతో తెలుసుకొనుము?
Ans: విషమ బాహు త్రిభుజ వైశాల్యం = ½*bh = ½*10*8
Scalene Triangle Area A = 40 square units
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.