Andhra Pradesh Board 10th Class Maths Syllabus – Telugu

ఈ రోజు ఆర్టికల్ లో ఆంధ్ర ప్రదేశ్ బోర్డు 10th క్లాస్ మ్యాథ్స్ సిలబస్ ఏంటో తెలుసుకోవచ్చు.

  1. Real Numbers – వాస్తవ సంఖ్యలు
  2. Sets – సమితులు
  3. Polynomials – బహుపదులు
  4. Pair of Linear Equations – రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత
  5. Quadratic Equations – వర్గ సమీకరణాలు
  6. Progressions – శ్రేఢులు
  7. Coordinate Geometry – నిరూపక జ్యామితి
  8. Similar Triangles – సరూప త్రిభుజాలు
  9. Tangents and Secants to a Circle – వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు
  10. Mensuration – క్షేత్రమితి
  11. Trigonometry – త్రికోణమితి
  12. Applications of Trigonometry – త్రికోణమితి అనువర్తనాలు
  13. Probability – సంభావ్యత
  14. Statistics – సాంఖ్యక శాస్త్రం

AP Board 10th Class Maths Syllabus Telugu

Real Numbers – వాస్తవ సంఖ్యలు

ఈ అధ్యాయం లో మనం ముక్యంగ  వాస్తవ సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుంటాం . వాస్తవ సంఖ్యలో ఏమి సంఖ్యలు వస్తాయ్ , వాటి మీద కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి. వాస్తవ సంఖ్యలో వున్న సిద్ధాంతాలు కూడా నేర్చుకుంటాం .

ఈ అధ్యాయం లో మనం ఎక్కవ గా కరణీయ సంఖ్య ని కరణీయ సంఖ్య గా ఎలా నిరూపించాలో తెలుసుకుంటాం .ఈ అధ్యాయం లో మనం చివరికి సంవర్గమాం గురించి నేర్చుకుంటాం.

Sets – సమితులు

ఈ అధ్యాయం లో మనం సమితులు గురించి వాటి రకాల గురించి ఉదాహరనల తో నేర్చుకుంటాం. వెన్ చిత్రాలు గురించి వాటి ఉపయోగాల గురించి కూడా నేర్చుకుంటాం .

Polynomials – బహుపదులు

ఈ అధ్యాయం లో బహుపదులు అంటే ఏమిటి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేర్చుకుంటాం .బహుపది యొక్క విలువ , బహుపది శూన్యాలు . బహుపదులతో ప్రక్రియలు , బహుపది శూన్యాలకు జాతీయ అర్ధాలు మొదలైనవి నేర్చుకుంటాం .

ఈ అధ్యాయం లో ఘన బహుపదుల ,బహుపదుల నియమాలు  ఈ అంశాలు చాల ముఖ్యం అవ్వి కూడా మనం నేర్చుకుంటాం .

Pair of Linear Equations – రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత

ఈ అధ్యాయం లో మనం ముక్యంగ అవ్యక్త రాశుల ను ఎలా కనుకోవాలి , గ్రాఫ్ పద్దతి ద్వారా  రేఖీయ సమీకరణల జతకు సాధన కనుకోవటం ,గుణకములు మరియు సమీకరణ వ్యవస్థ స్వభావము మధ్య గల సంబంధం ,  రేఖీయ సమీకరణల జతకు సాధన కనుకోటానికి కొన్ని పద్ధతులు మొదలైనవి నేర్చుకుంటాం .

Quadratic Equations – వర్గ సమీకరణాలు

ఈ అధ్యాయం లో వర్గ సమీకరణాలు అంటే ఏంటో పూర్తి గా నేర్చుకుంటాం.కారణం క పద్దతి ద్వారా వర్గ సమీకరణమును సాధించటం ఎలా ,వర్గమును పూర్తి చేయుట ద్వారా వర్గ సమీకరణమును సాధించటం ఎలా మరియు మొదలైనవి నేర్చుకుంటాం .

Progressions – శ్రేఢులు

ఈ అధ్యాయం లో మనం శ్రేఢులు అంటే ఏమిటి ,అంకశ్రేఢీ ఆధారపడే అంశాలు , అంకశ్రేఢీ యొక్క n వ పదము , అంకశ్రేఢీ లో n పదాల మొత్తము ,గుణశ్రేఢులు నేర్చుకుంటాం .

వీటి తో పటు ఈ అంశాలు మీద చాల ప్రశ్నలు కూడా పరిష్కరిస్తాం .

Coordinate Geometry – నిరూపక రేఖాగణితం

ఈ అధ్యాయం లో రెండు బిందువుల మధ్య దూరం, నిరూపక అక్షాలకూ సమాంతరంగా ఉన్నా రేఖ పై గల బిందువుల మధ్యదూరం,  నిరూకతంలోని ఏవేని రెండు బిందువుల మధ్యదూరం నేర్చుకుంటాం

అంతే కాకా విభజన సూత్రం , రేఖ యొక్క త్రిధాకరణ బిందువులు , త్రిభుజ వైశాల్యం , సరళరేఖ , కృత్వం మరియు మొదలైన అంశాలు నేర్చుకుంటాం .

Similar Triangles – సరూప త్రిభుజాలు

ఈ అధ్యాయం లో సరూప త్రిభుజాలు అంటే ఏమిటి, త్రిభుజాలు సరూపత ,ప్రాథమిక ఆసుపాత సిద్దాఅంతం, త్రిభుజాలు ,సరూపాత నియమాలు, త్రిభుజాల సరూపకతకు కో . కో . కో నియమము ,త్రిభుజాల సరూపకతకు భు . కో . భు నియమము నేర్చుకుంటాం.

అంతే కాకా పైథాగరస్ సిద్ధాఅంతం మొదలైన అంశాలు నేర్చుకుంటాం .

Tangents and Secants to a Circle – వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు

ఈ అధ్యాయం లో వృత్తానికి స్పర్శరేఖలు , వృత్తానికి స్పర్శరేఖ నిర్మించటం ,స్పర్శరేఖ పొడువు కనుకోవటం ,బాహ్య బిందువు నుండి వృథానికి స్పర్శరేఖలు నిర్మించటం ,వృత్త ఖఅండము యొక్క వైశాల్యము కనుకోవటం మొదలైన అంశాలు నేర్చుకుంటాం .

Mensuration – క్షేత్రమితి

ఈ అధ్యాయం లో మనం ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యము వాటి ఘనపరిమాణము మొదలైన అంశాలు నేర్చుకుంటాం .

Trigonometry – త్రికోణమితి

ఈ అధ్యాయం లో మనం త్రికోణమీతీమయ నిష్పత్తులు , త్రికోణమీతీమయ నిష్పత్తులు నిర్వించడం ,లంబకోణ త్రిభుజం లో ని నిష్పత్తులు , ప్రత్యేక కోణాల త్రికోణమీతీమయ నిష్పత్తులు , పూరక్ కోణాల త్రికోణమీతీమయ నిష్పత్తులు మధ్య సంబంధం నేర్చుకుంటాం .

వాటి తో పటు త్రికోణమీతీమయ సర్వసమీకరణాలు కూడ నేర్చుకుంటాం .

Applications of Trigonometry – త్రికోణమితి అనువర్తనాలు

ఈ అధ్యాయం లో మనం రెండు లంబకోణ త్రిభుజాలతో కూడిన సమస్యలు నేర్చుకుంటాం .

Probability – సంభావ్యత

ఈ అధ్యాయం లో మనం సంభావ్యత అంటే ఏమిటి ,పరస్పర వర్జిత ఘటనలు అంటే ఏమిటి, పూరక ఘటనలు అంటే ఏమిటి మరియు వివిధ ఘటనలు గురించి నేర్చుకుంటాం .

పేక ముక్కల కార్డుల సంభావ్యతకూడా నేర్చుకుంటాం .

Statistics – సాంఖ్యక శాస్త్రం

ఈ అధ్యాయం లో మనం ముక్యంగా బహుళకము ,వర్గీకృత దత్తంశము యొక్క మధ్యగతము నేర్చుకుంటాం .

Scroll to Top