- స్వయంపోషకాలు కాంతి శక్తిని ఉపయోగించుకుని రసాయనిక సమ్మేళనాలు తయారుచేసుకుంటాయి .
- వాన్ నిల్ అనే శాస్త్ర వేత్త పర్పుల్బాక్టీరియాలు పై పరిశోధనచేస్తూ కిరణ జన్య సంయోగక్రియలో కాంతి పాత్ర గురించి కనుగొన్నాడు .
- మొక్కలు మొదటగా సరళమైన కార్బో హైడ్రేట్స్ ను తయారుచేసుకుంటాయి . తరువాత స్టార్చ్ వంటి సంక్లిష్టమైన పిండి పదార్థాలను మరియు సెల్యులోజ్ ను సంశ్లేషిస్తాయి . ఇవే కాకుండా మొక్కలు ప్రోటీన్లు , లిపిడ్లు మొదలైన పదార్థాలను కూడా తయారుచేసుకో గలుగుతాయి .
- కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యక పదార్థాలుగా కాంతి , నీరు , కార్బన్డయాక్త్సెడ్, పత్రహరితములను పేర్కొనవచ్చు .
- ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని జోసఫ్ ప్రీస్ట్ 1770 వ సంవత్సరంలో నిర్వహించిన ప్రయోగాల పరంపర ద్వారా తెలిసింది.
- 1774వ సంవత్సరంలో జోసఫ్ ప్రిస్ట్లే ఆక్సిజన్ కనుగొన్న విషయాన్నీ జ్ఞప్తికి తెచ్చుకోడి. 1775వ సంవత్సరంలో లెవోయిజర్ ఆ వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేశాడు.
- 1817వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు Kavansho అనే ఇద్దరు శాస్త్రవేత్త లు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని వేరుచేసారు ఆ కషాయానికి పత్రహరితం అని నామకరణం చేసారు . క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్ధం .
- 1883వ సంవత్సరంలో జూలియస్ వాన్ సాక్స్ అనే శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలోని కణం అంతా వ్యాపించి ఉండదని గమనించాడు. క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ కణాంగాలనే హరితరేణువులు అని అంటారు. మొక్కలలో పత్రరంద్రాలలోని రక్షక కణాలలో మరియు సంధాయక కణజాలంలో క్లోరోప్లాస్ట్ లు అధిక సంఖ్యలో ఉంటాయి.
- క్లోరోప్లాస్ట్ లు త్వచంతో కూడిన నిర్మాణాలు . ఇందులో రెండు త్వచాలు ఉంటాయి. లోపల ఉన్న దొంతరలవంటి నిర్మాణాలను థైల్కోయిడ్ అంటారు. ఈ థైల్కోయిడ్ దొంతరలను గ్రానా అంటారు. ఈ ప్రదేశంలో కాంతిశక్తి గ్రహించబడుతుంది . దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. దీనిని స్ట్రోమా అంటారు.
- హరితరేణువులో కాంతిని శోషించే పదార్దాలను కిరణజన్యసంయోగక్రియ వర్ణకాలు అంటారు.
- పత్రహరితం రక్తం లోని హీమోగ్లోబిన్ అనే వర్ణకంలోని హీమ్ ను పోలి ఉంటుంది. అయితే హిమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటె పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది.
- కిరణజన్యసంయోగ క్రియ ప్రధానంగా రెండు దశలలో జరుగుతుంది. అవి
1.కాంతి చర్య
2. నిష్కాంతి చర్య
- కొన్ని ఈస్టులు ,కుక్కగొడుగులు , రొట్టె బూజులు వంటి జీవులు ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. వీటిని పూతికాహారులు అంటారు.
- ఏకకణ జీవి అయిన పారమీషియంకి కాలిచెప్పు ఆకారంలో ఉంటుంది.
- మానవులోని ఆహారనాళం పొడవైన గొట్టంవంటి నిర్మాణం. ఇది నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది.
- మనం అనేక రకాల ఆహారపదార్దాలు తిన్నప్పటికీ అవన్నీ ఒకే జీర్ణనాళం ద్వారా పంపబడతాయి. మనం ఆహారాన్ని తీసుకునే విధానాన్ని అంతరగ్రహణం అంటారు.
- ఎంజైముల సహాయంతో సంక్లిష్ట పదార్దాలు సరళ పదర్దాలుగా విడగొట్టబడి శరీరం శోషించుకోవడానికి అనువుగా మార్చే విధానాన్ని జీర్ణక్రియ అంటారు.
- మెత్తటి ఆహారం లాలాజలంతో కలిసిన తరువాత ఆహారవాహికలో పంపబడుతుంది. ఆహారం ఆహార వాహిక గుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనాన్ని గమనిస్తాం . దీనినే పెరిస్టాలిక్ చలనం అంటారు.
- ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ అణువులు చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటి రూపంలోకి మారుతుంది. దీనినే కైమ్ అని అంటారు.
- కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం కొవ్వు పదార్దాలను జీర్ణం చేసి చిన్న చిన్న రేణువులుగా మారుతుంది. ఈ విధానాన్ని ఎమ్మెల్సీకరణం అని అంటారు.