ఏవేని రెండు బిందువుల మధ్య కాంతి ప్రయాణించేటప్పుడు అతి తక్కువ సమయం పట్టే మార్గంలోనే ప్రయాణిస్తుందని ___________తెలుపుతుంది .
ANS ఫెర్మాట్ సూత్రము
ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు కాంతి వడి మారడంవల్ల , కాంతి దిశ మారె దృగ్విషయాన్ని ______________ అని అంటారు .
ANS కాంతి వక్రీభవనం
V 1 కన్నా V 2 తక్కువ అయితే ఒకటో యానకంకన్నా రెండో యానకం _____________ అని అంటారు .
ANS సాంద్రతర యానకం
V 1 కన్నాV 2 ఎక్కువైతే ఒకటో యానకం కన్నా రేండో యానకం ______________అంటారు.
ANS విరాళ యానకం
లంబానికి -పతనకిరణానికి మధ్య కోణాన్ని ________________అని అంటారు.
ANS పతన కోణం
లంబానికి -వక్రీభవనకిరణానికి మధ్య కోణంను ____________అని అంటారు.
ANS వక్రీభవన కోణం
ఏదేని యానకంలో కాంతి వడి V అనుకుంటే , శూన్యంలోని కాంతి వడికి , ఆ యానకంలో కాంతి వడికి గల నిష్పత్తిని ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం N గా నిర్వచిస్తాం . దీనినే _________________________అని అంటారు.
ANS పరమ వక్రీభవన గుణకం
వక్రీభవనంలో కాంతి _____________నియమాన్ని పాటిస్తుంది.
ANS స్నెల్ నియమం
నిర్దిష్ట పతన కోణం వద్ద వక్రీభవన కిరణం గాజు, గాలి యనకాలను వేరుచేసే రేఖ వెంబడి ప్రయాణించడం మీరు గమనించవచ్చు. అప్పుడు పతన కోణాన్ని కొలవండి. ఆ కోణాన్ని ______________అని అంటారు.
ANS సందిగ్ధ కోణం
సాంద్రత యానకం నుండి విరాళ యాంకంలోనికి ప్రయాణించే కాంతి కిరణానికి ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యనకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణింస్తుందో , ఆ పతన కోణాన్ని __________________యొక్క సందిగ్ధ కోణం అని అంటారు.
ANS సాంద్రతర యానకం
కాంతి కిరణం విరాళ యానకంలోనికి ప్రవేశించదు . ఈ దృగ్విషయాన్ని ________________అని అంటారు.
ANS సంపూర్ణంతర పరవర్తనం
ఎండమావులు అనేవి _________________వళ్ళ ఏర్పడతాయి
ANS ధృక్ భ్రమ
ఆకాశం యొక్క మిధ్యప్రతిబింబం మనకు రోడ్లపై నీళ్లవలె కనిపిస్తుంది. దీనినే _______________. అని అంటారు.
ANS ఎండమావులు