ఈ రోజు మన ఆర్టికల్ లో రక్త పీడనం గురించి తెలుసుకుందాం .
రక్త పీడనం అనగా బీపీ అని అర్ధం .
రక్త వర్గీకరణ మొదలైన అంశాల గురించి జంతుకణజాలం అనే చదివారు కదా .ఇప్పుడు మనం రక్తం గురించి మరికొన్ని విషయాలు అధ్యయనం చేద్దాం .
రక్తాన్ని వలవంటి రక్తనాళాల ద్వారా ప్రవహిపజేయాలంటే చాల ఎక్కువ ఒత్తిడి కావాలి .
గుండెలోని జఠరికలు సంకోచించి ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనులలోనికి పంపుతాయి .
జఠరికలు పీడనాన్ని కోల్పోయి మామూలు స్థితికి చేరుతూ, తర్వాత సంకోచానికి సిద్ధం అవుతాయి .
డాక్టర్లు స్పిగ్మోమానోమీటర్ అనే పరికరం తో బీపీ ని కొలుస్తారు .
రక్త పీడనం మన శరీరం లో వివిధ శరీర భాగాల్లో వేరు వేరుగా ఉంటుంది .
కాబట్టి ఎప్పుడు శరీరం లో నియమితమైన ప్రదేశంలో మాత్రమే రక్త పీడనాన్ని కొలిస్తే వేరు వేరు సమయం లో పీడనాన్నిసరిపోల్చడానికి అవసరం ఉంటుంది .
అందువలన డాక్టర్లు మన దందా చేయి మోచేయి పై భాగం లో పట్టుకుని చూస్తారు .
ఉండే ధమనీ పీడనాన్ని మాత్రమే కొలుస్తారు .
రక్త పీడనానికి సంబంధిచి డాక్టర్లు రెండు రీడింగులు నోట్ చేస్తారు .
జఠరికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోనికి పంపినప్పుడు ఫస్ట్ రీడింగ్ తీస్తారు .
ఇది ఆరోగ్యవంతులైన అమ్మాయిలు , అబ్బాయిలలో 120మి . మి . పాదరస పీడనంగా ఉంటుంది .
దీనిని సిస్టోలిక్ పీడనం SYSTOLE అని అంటారు . జఠరికలు మామూలు స్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయం లో సెకండ్ రీడింగ్ తీస్తారు .
ఇది 80మి. మి పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది . దీనినే డయాస్టోలిక్ పీడనం DIASTOLE అని అంటారు .
రక్త పీడనం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది . విశ్రాంతి ,నడవడం ,పరిగెత్తడం అటువంటి పనులలో రక్త పీడనం వేరువేరు పని చేస్తుంది .
విశ్రాంతి సమయం లో సాధారణ రక్త పీడనం 120 80 కంటే ఎక్కువ రక్త పీడనం ఉండునట్లైతే ఆ వ్యక్తికీ అధిక రక్త పోటు HYPERTENSION ఉన్నట్లుగా భావిస్తారు .
Some Questions and Answers on Blood Pressure
Q: రక్త పీడనాన్ని ఇంగ్లీష్ లో ఏమని అంటారు ?
Ans: రక్త పీడనాన్ని ఇంగ్లీషులో బ్లడ్ ప్రెషర్ అని అంటారు
Q: రక్త పీడనాన్ని కొలిచే పరికరాన్ని ఎం అంటారు ?
Ans: రక్త పీడనాన్ని కొలిచే పరికరాన్ని స్పిగ్మోమానోమీటర్ అని అంటారు .
Q: సిస్టోలిక్ పీడనం అంటే ఏమిటి ?
Ans: ఆరోగ్యవంతులైన యువతీ , యువకులలో 120 మి . మి . పాదరస పీడనం గా ఉంటుంది . ధీనిని సిస్టోలిక్ పీడనం అని అంటారు .
Q: డయాస్టోలిక్ పీడనం అంటే ఏమిటి ?
Ans: ఇది 80మి . మి . పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది . దీనినే డయాస్టోలిక్ పీడనం అని అంటారు .
Q: ఒక వ్యక్తికి అధిక రక్త పోటు ఉన్నట్లు ఎప్పుడు భావిస్తారు?
Ans: విశ్రాంతి సమయంలో సాధారణ రక్త పీడనం 120 /80 కంటే ఎక్కువ రక్త పీడనం బీపీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అధిక రక్త పోటు HYPERTENSION ఉన్నట్లుగా భావిస్తారు .
.