Branches of Botany in Telugu – వృక్ష శాస్త్రం లో శాఖలు

ఈ  రోజు మన ఆర్టికల్ లో వృక్ష శాస్త్ర  విభాగాలు గురించి తెలుసుకుందాం. 

పరాగరేణు శాస్త్రం 

దీనిని ఇంగ్లీష్ లో palynology సిద్ధ బీజాలు లేదా పరాగ రేణువుల ఉత్పత్తి, నిర్మాణం లాంటివి అన్ని సంబంధించిన అంశాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇది . 

స్వరూపశాస్త్రం 

మొక్కల్లోని వివిధ భాగాలను అధ్యయనం చెయ్యడానికి ,వర్ణనకు సంభందించినది .  మొక్కల వర్గీకరణకు మౌలిక ఆధారం . 

దీన్ని రెండు భాగాలుగా విభజించారు. బాహ్య స్వరూప శాస్త్రం. దీనిని ఇంగ్లీష్ లోexternal morphology అని అంటారు . 

మొక్కలోని భాగాలైన వేరు ,కాండం ,పత్రం ,పుష్పం , విత్తనం ,ఫలం ,బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసి వర్ణచడం జరుగుతుంది . 

అంతర స్వరూప శాస్త్రం దీనిని ఇంగ్లీష్ లో internal morphology అని అంటారు . ఇది వివిధ భాగాల అంతర్నిర్మాణాన్ని తెలియజేస్తుంది . 

దీనిని రెండు శాఖలుగా విభజించారు . 

కణ జాల శాస్త్రం మొక్కలోని వివిధ భాగాలను అధ్యయనం చేసే భాగం . అంతర్నిర్మాణ  శాస్త్రం మొక్కలోని భాగాలైన వేరు ,

కాండం , పత్రం , పుష్పములోని అంతర్నిర్మాణ వివరాలకు సంభందించినది . 

వృక్ష వర్గీకరణ శాస్రం 

దీనిని ఇంగ్లీష్ లో plant taxonomy అని లేదా సిస్టమాటిక్ బోటనీ అని కూడా అంటారు . 

వృక్ష శాస్త్రం లోని వివిధ  నుంచి లభించే సమాచారం ఆధారంగా మొక్కలను గుర్తుంచడం లేదా పేరు పెట్టడం ,

లేదా సంబంధిత వర్గాలుగా వర్గీకరించడం ఈ శాఖకు సంభందించిన అంశం ఇప్పుడు మనం 

వృక్ష శరీర ధర్మ శాస్త్రం గురించి తెలుసుకుందాం దీనిని ఇంగ్లీష్ లో plant  physiology అని అంటారు . 

మొక్కలలో నిత్యం జరిగే నీరు ఖనిజ లవణాల శోషణ ,

కిరణజన్య సంయోగ క్రియ శ్వాస క్రియ , నత్రజని జీవ క్రియ , చర్యల్ని metabolic activities గురించి అధ్యయనం చేస్తుంది ఈ శాస్త్రం . 

వృక్ష ఆవరణ శాస్త్రం 

దీన్ని plant ecology అని అంటారు మొక్కలను ,

అవి జీవించే ప్రకృతి కి మధ్య గల పరస్పర సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది . పుర వృక్ష శాస్త్రం దీన్ని palaeobotany మొక్కల శిలాజాల గురించిఅధ్యయనం చేస్తుంది . దీని సహాయం తో మొక్కల్లో పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకోవడానికి వీలు పడుతుంది . 

జన్యు శాస్త్రం 

దీనిని ఇంగ్లీష్ లో genetics జన్యువుల నిర్మాణం , వాటి సంశ్లేషణ , అనువంశికత , ఉత్పరివర్తనలు మొదలైన అన్ని అంశాలను గురించిన అధ్యయనం చేస్తుంది . 

కణ జీవ  శాస్త్రం 

దీనిని ఇంగ్లీష్ లో cytology or cell biology అని అంటారు 

కణం ,కణాంగాల నిర్మాణం , విధులు వాటి వృద్ధి కణవిభజనకి సంభందించినది  

పిండోత్పత్తి శాస్త్రం 

దీనిని ఇంగ్లీష్ లో embryology అని అంటారు . 

స్త్రీ ,పురుష సంయోగ బీజాలు gametophytes ఏర్పడటం ,

సంయోగ బీజాల gametes ఉత్పత్తి ,ఫలదీకరణ విధానం ,

పిండం అంకురచ్ఛదం , విత్తనాలు ఏర్పడటానికి సంబంధించినది . 

వృక్షభౌగోళిక శాస్త్రం 

phytogeography గత కాలంలోనూ భూమండలంలోని వివిధ ప్రాంతాలలో మొక్కల వితరణ గురించిన అధ్యయనం . వృక్ష వ్యాధి శాస్త్రం దీనిని ఇంగ్లీష్ లో plant  pathology అని అంటారు . మొక్కలోని వ్యాధి కారకాలు ,

వ్యాధి లక్షణాలు , నియంత్రణ పద్ధతుల గురించి అధ్యయనం చేస్తుంది .

 శైవల శాస్త్రం 

దీనిని ఇంగ్లీష్ లో phycology పత్ర హరితం కలిగి , స్వయం పోషితాలుగా జీవించే థాలోఫైట మొక్కలైనా శైవలా శాస్త్రం  గురించి అధ్యయనం చేస్తుంది . 

శిలింద్ర శాస్త్రం 

mycology అని కూడా అంటారు . పత్ర హరిత రహితమైన పర పోషితాలుగా నివసించే థాలోఫైట మొక్కలైనా శిలింద్రాల గురించి అధ్యయనం చేస్తుంది . 

Lichenology 

ఒక శైవలం , ఒక శిలింధ్రం పరస్పరం ఆధారపడుతూ సహజీవనం గడిపే ప్రత్యేక వర్గపు మొక్కలైనా లైకెన్ల అధ్యయనం గురించి తెలియజేస్తుంది . 

బ్రయోలజీ 

bryology వృక్ష రాజ్యపు ఉభయ చరాలైన బ్రయోఫైట మొక్కల గురించిన అధ్యయనం . 

టెరిడాలోజి 

Pteridology నాళికా కణజాలయుత పుష్పించని మొక్కలైనా టెరిడోఫైట మొక్కల గురించి అధ్యయనం చేస్తుంది . 

మీకు ఈ ఆర్టికల్ సహాయ పడతాది అనుకుంటున్నాను.

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి.

Scroll to Top