Branches of Zoology – జంతు శాస్త్రం లోని శాఖలు

ఈ రోజు మన ఆర్టికల్ లో మనం జంతు శాస్త్రంలోని వివిధ శాఖలు గురించి తెలుసుకుందాం  . 

ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త లామర్క్ 1809లో జీవశాస్త్రం అనే పదాన్ని గుర్తించాడు . 

దీని అర్ధం జీవుల గురించి తెలుసుకోవడం . 

భిన్నత్వంగా ఉన్న ఈ శాస్త్రం జంతువులకు సంభందించిన అన్ని అంశాల గురించి తెలియజేస్తుంది . 

ఇది అనేక ఉపశాఖలను కలిగి ఉంది . 

ఇప్పుడు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందం .  

పిండోత్పత్తి శాస్త్రం Embryology

ఇది జీవులలో జరిగే పిండ అభివృద్ధి గురించి తెలియజేస్తుంది. దీనిలో ఫలదీకరణం , సంయుక్త బీజం లో జరిగే విదళనాలు , అనేక పిండ అభివృద్ధి దశలను తెలియజేస్తారు . 

ప్రస్తుతం పిండ అభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి సజీవశాస్త్రం లో ఒక భాగంగా ఎన్నుకున్నారు 

అభివృద్ధి జీవశాస్త్రం జీవుల పిండ అభివృద్ధి సమయంలో జరిగే కణవిబేధానం రూప జనిత కదలికలు ,

అవయవాల అభివృద్ధి , పిండ అభివృద్ధిలో జన్యువుల పాత్ర మొదలైన అంశాలతో  పాటు జనాంతర అభివృద్ధిని కూడా వివరిస్తుంది . 

పరిణామ శాస్త్రం EVOLUTION 

జీవుల ఆవిర్భావం ,పరిసరాలకు అనుగుణంగా ఎప్పుడు జీవులలో కలిగే జన్యు అనుకూలనాల పరమైన మార్పులను వాటి ఫలితం గా  కొత్త జాతులు ఏర్పడే ప్రక్రియ విధానాన్ని తెలిపే శాస్త్రం . 

పరిమాణం అంటే వికాసం అని అర్ధం. 

జీవ పరిమాణం అనే పేరును హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు . 

జీవ వరణ శాస్త్రం ECOLOGY 

ఇకాలోజి అనే పదాన్ని హెకెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు . 

ఇది జీవులకు తమ తోటి  జీవులతోనూ ,నిర్జీవ పరిసర కారకాలతోనూ గల సంబంధాన్ని తెలియజేసే శాస్త్రం. 

ETHOLOGY 

జంతువుల ప్రవర్తన గురించి వివరించే శాస్త్రం దీని ప్రవర్తన జీవశాస్త్రం BEHAVIOURAL BIOLOGY అని కూడా అంటారు . 

జన్యు శాస్త్రం GENETICS 

ఇది అనువంశిక లక్షణాలు ఒక తరం జీవుల  నుంచి తర్వాతి తరం జీవులకు ఎలా ఎలా సంక్రమిస్తాయో తెలియజేసే శాస్త్రం ఇది.

 అనువంశికత ,వైవిధ్యాన్ని గురించి వివరిస్తుంది. 

జెనెటిక్స్ అనే పదాన్ని బెట్ సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు . 

కణజాల శాస్త్రం HISTOLOGY 

వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మానిర్మాణం ,వాటి అమరికను  గురించి తెలియజేసే శాస్త్రం.  దీన్నే సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం అని కూడా అంటారు

కణ శాస్త్రం CYTOLOGY కణం ,దానిలోని కణాంగాల రూపం ,నిర్మాణం , విధుల గురించి తెలియజేస్తుంది . ఈ శాస్త్రం కణాన్ని జీవుల నిర్మాణాత్మక , క్రియాత్మక ప్రమాణం  గా తెలియజేసే శాస్త్రాన్ని కణజీవ శాస్త్రం CELL BIOLOGY అని అంటారు . 

స్వరూప శాస్త్రం MORPHOLOGY 

వివిధ జీవుల రూపం ,పరిమాణం ,ఆకారం ,రంగు వాటి శరీరం లోని కణజాలాలు , అవయవాలు ,అవయవ వ్యవస్థల స్వరూపం వివరించే శాస్త్రం . ఇది రెండు రకాలు 

బాహ్య స్వరూపం EXTERNAL MORPHOLOGY 

జంతువుల అంతర త్వచం లక్షణాలను వివరించే శాస్త్రం 

అంతర స్వరూపశాస్త్రం INTERNAL MORPHOLOGY 

జంతువుల శరీరం లోని లోపల భాగాల స్వరూపా న్ని వివరించే శాస్త్రం దీనిని రెండు భాగాలుగా విభజించవచ్చు 

అంతర్నిర్మాణ శాస్త్రం ANATOMY 

జంతువుల శరీరంలోని అవయవాలు లేదా అవయవ వ్యవస్థల అంతర్గత భాగాల అమరికను తెలియజేసే శాస్త్రం ఇది . 

శరీర ధర్మ శాస్త్రం PHYSIOLOGY 

జంతు దేహంలోని వివిధ అవయవాల క్రియల విధానాన్ని తెలిపే శాస్త్రం . 

పురా జీవశాస్త్రం Palaeontology

పూర్వ కాలంలో జీవించిన జీవుల అవశేషాలైనా శిలాజాలను గురించి అధ్యయనం చేయడాన్ని పురాజీవ శాస్త్రం అని అంటారు . 

ఈ  శాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు . 

పేలియోబోటనీ మొక్కల శిలాజాల అధ్యయనం . 

పేలియో జూవాలజీ జంతు శిలాజాల అధ్యయనం . 

వర్గీకరణ శాస్త్రం TAXONOMY 

సిద్దాంత  ద్వారా ,ఆచరణ ద్వారా జీవులను గుర్తించి ,

 వాటికి పేరు పెట్టె వర్గీకరణ చేసే శాస్త్రం . 

టాక్సానమీ అనే పదాన్ని A . P డీ కాండోల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు . 

 మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకేమయినా సందేహాలు  కింద కామెంట్ చేయండి. 

Scroll to Top