ఈ రోజు ఆర్టికల్ లో 2 యొక్క divisibility రూల్ కోసం discuss చేసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఈ divisibility రూల్స్ నేర్చుకొనవలెను.
వివధ లెక్కలు సులభంగా చేయుటకు ఈ divisibility రూల్స్ ఉపయోగపడతాయి.
Divisibility Rule of 2 in Telugu
ఇచ్చిన అంకె లో ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, or 8 ఉంటే ఇచ్చిన అంకె 2 తో divisible అవుతుంది.
ఇచ్చిన అంకె లో ఒకట్ల స్థానంలో 1 , 3 , 5 , 7 , or 9 ఉంటే ఇచ్చిన అంకె 2 తో divisible అవ్వదు.
సులభంగా గుర్తు పెట్టుకొనుటకు
Even Numbers సరి సంఖ్యలు 2 తో divisible అవుతాయి.
Odd Numbers బేసి సంఖ్యలు 2 తో divisible అవ్వవు.
Examples:
1230 : ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 1230 2 తో divisible అవుతుంది.
4526 : ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి 4526 రెండు తో divisible అవుతుంది.
567 : ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి 567 రెండుతో divisible అవ్వదు.
98735: ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 98735 రెండుతో divisible అవ్వదు.
2 వ భాజనీయత సూత్రం మీద కొన్ని ప్రశ్నలు :
Q1: ఒక బుట్టలో 251 apples ఉన్నాయి. అయితే వాటిని ఇద్దరికీ ముక్కలు చేయకుండా సమానంగా పంచగలమా?
సమాధానం: ఇచ్చిన సంఖ్య 251 ఒకట్ల స్థానంలో 1 ఉంది కాబట్టి 251 రెండుతో divisible అవ్వదు. కాబట్టి బుట్టలో ఉన్న 251 apples ని ఇద్దరికీ సమానంగా పంచగ ఒకటి మిగులుతుంది. కాబట్టి వాటిని సమానంగా పంచలేము.
Q2: ఒక సంఖ్య 126579 రెండుతో divisible అవుతుందా ?
సమాధానం : ఇచ్చిన సంఖ్య 126579 ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి 126579 రెండుతో divisible అవ్వదు.
Q3: ఒక సంఖ్య 12536 రెండుతో divisible అవుతుందా?
సమాధానం: ఇచ్చిన సంఖ్య 12536 ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి 12536 రెండుతో divisible అవుతుంది.
Q4 : రెండుతో divisible అయ్యే మూడు అంకెల నాలుగు సంఖ్యలను తెలపండి?
సమాధానం: 232, 124, 566, 898
Q5: రెండుతో divisible అవ్వని మూడు అంకెల నాలుగు సంఖ్యలను తెలపండి?
సమాధానం : 231, 125, 457, 659.