ఈ రోజు ఆర్టికల్ లో మనం Isosceles Triangle కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Isosceles Triangle ను తెలుగులో సమద్వి బాహు త్రిభుజం అని అంటారు.
ఒక త్రిభుజం లో రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని Isosceles Triangle అని అంటారు.
సమద్వి బాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే ఆ సమ భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటాయి.
భుజాన్ని బట్టి త్రిభుజాలు మూడు రకములు.
సమ బాహు త్రిభుజం , సమద్వి బాహు త్రిభుజం , విషమ బాహు త్రిభుజం.
సమ బాహు త్రిభుజం లో మూడు భుజములు సమానంగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజం లో రెండు భుజములు సమానంగా ఉంటాయి.
విషమ బాహు త్రిభుజం లో మూడు భుజాల పొడవులు మూడు రకాలుగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజం లో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు.
సమద్వి బాహు త్రిభుజం యొక్క Perimeter = 2a+b
సమద్వి బాహు త్రిభుజంలో unequal భుజమును Base అని అంటారు.
Area of Isosceles Triangle = ½ bh
Some Problems with Answers on Isosceles Triangle in Telugu
Q : ఒక సమద్వి బాహు త్రిభుజంలో భుజాలు 4, 4, 5 units అయిన ఆ త్రిభుజ Perimeter ఎంత?
Ans : సమద్వి బాహు త్రిభుజం లో రెండు భుజాలు సమానంగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజ Perimeter = 2a+b = 2*4 + 5 = 13 యూనిట్స్
Q : ఒక సమద్వి బాహు త్రిభుజం లో unequal angle 90 డిగ్రీస్ అయిన equal angles ఏమిటో కనుగొనండి?
Ans : సమద్వి బాహు త్రిభుజం లో రెండు కోణములు సమానంగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజం లో మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలు.
A+B+C = 180
A+A+90 = 180
2A+90 = 180
2A = 180 – 90 = 90
A = 90/2 = 45
Equal angles = 45 degrees.
Q : ఒక సమద్వి బాహు త్రిభుజం లో unequal angle 100 డిగ్రీస్ అయిన equal angles ఏమిటో కనుగొనండి?
Ans : సమద్వి బాహు త్రిభుజం లో రెండు కోణములు సమానంగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజం లో మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలు.
A+B+C = 180
A+A+100 = 180
2A+100 = 180
2A = 180 – 100 = 80
A = 80/2 = 40
Equal angles = 40 degrees.
Q : ఒక సమద్వి బాహు త్రిభుజం లో unequal angle 40 డిగ్రీస్ అయిన equal angles ఏమిటో కనుగొనండి?
Ans : సమద్వి బాహు త్రిభుజం లో రెండు కోణములు సమానంగా ఉంటాయి.
సమద్వి బాహు త్రిభుజం లో మూడు కోణముల మొత్తం 180 డిగ్రీలు.
A+B+C = 180
A+A+60 = 180
2A+60 = 180
2A = 180 – 60 = 120
A = 120/2 = 60
Equal angles = 60 degrees.
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.