Odd Numbers in Telugu – బేసి సంఖ్యలు

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో Odd Numbers కోసం డిస్కస్ చేసుకుందాం.

Odd Numbers ని తెలుగులో బేసి సంఖ్యలు అని అంటారు.

2 తో భాగించినపుడు శేషం One వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు.

1, 3, 5, 7, 9 , …

దశాంశ మానంలో ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1,3,5,7,9 ఉంటే అది బేసి సంఖ్య అవుతుంది.

Ex : 21, 43, 59 etc

సున్నా బేసి సంఖ్య కాదు.

మిక్కిలి చిన్న బేసి సంఖ్య ఒకటి.

మిక్కిలి పెద్ద బేసి సంఖ్య ఏమిటో చెప్పలేము. ఇది అనంతం.

Odd Numbers ని O తో సూచిస్తారు.

Odd Numbers ఋణాత్మకంగా కూడా ఉండవచ్చు. for example -3, -25 etc

p ఒక పూర్ణ సంఖ్య అయిన బేసిసంఖ్య n = 2p + 1 (లేదా 2p – 1) రూపంలో ఉంటుంది.

బేసి సంఖ్యలను సమితి రూపంలో కింది విధంగా వ్రాయవచ్చు.

బేసి సంఖ్యలు {\displaystyle =\{2k+1:k\in \mathbb {Z} \}}

Properties of Odd Numbers in Telugu

  • రెండు బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది.
  • రెండు బేసి సంఖ్యల భేదం సరి సంఖ్య అవుతుంది
  • రెండు బేసి సంఖ్యల లబ్దం బేసి సంఖ్య అవుతుంది.
  • రెండు వరుస బేసి సంఖ్యల మొత్తం సరి సంఖ్య అవుతుంది
  • రెండు వరుస బేసి సంఖ్యల భేదం రెండు.
  • ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య మొత్తం బేసి సంఖ్య అవుతుంది
  • ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య భేదం బేసి సంఖ్య అవుతుంది
  • ఒక సరి సంఖ్య ఒక బేసి సంఖ్య లబ్దం సరి సంఖ్య అవుతుంది
  • బేసి సంఖ్యలను 2n-1 రూపంలో వ్రాస్తారు. ఇక్కడ n అనునది ఒక సహజ సంఖ్య
  • n వరుస బేసి సంఖ్యల మొత్తం n2

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను

మీకేమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top