ఈ రోజు మన ఆర్టికల్ లో Photosynthesis గురించి తెలుసుకుందాం .
Photosynthesis ని తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు .
కిరణ జన్య సంయోగక్రియ జరిపే మొక్కల పత్రాలు ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణ దాన్ని కలిగి ఉంటాయి .
దీనినే పత్రహరితం క్లోరోఫీల్ అని అంటారు .
ఇవి కాంతి శక్తిని వినియోగించి సరళ అకర్బన పదార్ధాలను సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చుతాయి . ఈ ప్రక్రియనే కిరణ జన్య సంయోగ క్రియ అని అంటారు .
ఇది చాల సంక్లిష్టమైన విధానం . ఇందులో అనేక రకాల చర్యలు క్రమపద్ధతిలో జరుగుతుంది . దీనితో పాటుగా అనేక సమ్మేళనాల [ intermediary compounds ]కూడా ఏర్పడుతు ఉంటాయి .
గత 200 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియను సరళమైన సమీకరణ రూపంలో చూపడానికి చాల కృషి చేస్తున్నారు .
1931వ సంవత్సరంలో సి . బి . వాన్ నీల్ [డచ్ ]అనే ఒక శాస్త్రవేత్త రూపొందిచిన సమీకరణాన్ని ప్రామాణికంగా ఆమోదించి ఇప్పటికి కూడా మనం వినియోగిస్తున్నాం .
కిరణజన్య సంయోగక్రియ లో కార్భోహైడ్రేట్ ఏర్పడటం దీనితో పాటుగా ఒక అణువు నీరు అలాగే ఒక అణువు ఆక్సీజన్ కూడా విడుదల చేస్తాయని ఆ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు .
కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ చాల సంక్లిష్టమైనదైనప్పటికీ ప్రస్తుతం మనం అందరం సులభంగా ఉన్న ఈ సమీకరణాన్నే ఉపయోగిస్తున్నాం .
గ్లూకోజ్ [C6H12O6]ఏర్పడే విధంగా చూపించాలనుకుంటే సమీకరణం ఏ రకంగా ఉండాలి . దీని కోసం సమీకరణాన్ని సమానం చేసి తిరిగి రాయండి .
వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ సల్ఫర్ అనే బ్యాక్టీరియాల పై పరిశోధనలు చేస్తూ కిరణ జన్య సంయోగక్రియలో కాంతి పాత్ర గురించి తెలుసుకున్నాడు .
అయితే బాక్టీరియాలు H2O కు బదులుగా H2S ను మొదలు పెట్టె పదార్ధం గా వినియోగిస్తాయి .
ఈ బాక్టీరియాలు జరిపే కిరానా జన్య సంయోగ క్రియలలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ ఉండడాన్ని ఆ శాస్త్రవేత్త గుర్తించాడు .
రాబర్ట్ హిల్ ఈ చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించాడు .
మొక్కలు మొట్ట మొదటిగా సరళమైన కార్బోహైడ్రేట్లను ఏర్పరచుకుంటాయి .
తర్వాత స్టార్చ్ వంటి సంక్లిష్టమైన పిండి పదార్ధాలను అలాగే సెల్యూలోజ్ ను సంశ్లేషిస్తాయి .
అవే కాకుండా మొక్కలు పోషకాలు ,లిపిడ్లు మొదలైన పదార్ధాలను కూడా తయారుచేసుకుంటాయి .
కానీ జంతువులు కార్భోహైడ్రేట్లను వాటికి అవి సొంతంగా తయారుచేసుకోలేవు .
అందుకే జంతువులు కార్భోహైడ్రేట్ల కోసం మొక్కల పై ఆధారపడతాయి .
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చెయ్యండి.