ఈ రోజు ఆర్టికల్ లో మనం లంబ కోణ త్రిభుజం కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
లంబ కోణ త్రిభుజమును ఇంగ్లీష్ లో right angled triangle అని అంటారు.
ఒక త్రిభుజంలో ఉండే కోణాల విలువలను బట్టి త్రిభుజములు మూడు రకములు
అల్ప కోణ త్రిభుజం , లంబకోణ త్రిభుజం , అధిక కోణ త్రిభుజం.
అల్ప కోణ త్రిభుజం లో మూడు కోణములు 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి.
లంబకోణ త్రిభుజం లో ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుంది , మిగతా రెండు కోణములు 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి.
అధిక కోణ త్రిభుజం లో ఒక కోణం విలువ 90 డిగ్రీలు కంటే ఎక్కువ గా ఉంటుంది.
ఒక త్రిభుజం లో ఒక కోణం 90 డిగ్రీలు అయినచో ఆ త్రిభుజాన్ని లంబ కోణ త్రిభుజం అని అంటారు. ఆ కోణాన్ని లంబ కోణం అని అంటారు.
ఒక లంబ కోణ త్రిభుజంలో ఒకే ఒక లంబ కోణం ఉంటుంది.
లంబ కోణ త్రిభుజం లో లంబ కోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని Hypotenuse అని అంటారు. దీనిని తెలుగులో కర్ణం అని అంటారు.
ఒక లంబ కోణ త్రిభుజం లో కోణముల మొత్తం 180 డిగ్రీలు.
Some Problems on Right Angled Triangle in Telugu
Q: ఒక లంబ కోణ త్రిభుజం లో ఒక కోణం 30 డిగ్రీలు అయినా రెండవ కోణం విలువ తెలుసుకొనుము.
Ans : ఒక లంబ కోణ త్రిభుజం లో కోణముల మొత్తం 180 డిగ్రీలు.
లంబ కోణ త్రిభుజం లో ఒక లంబ కోణం ఉంటుంది.
మరియొక కోణం = 180-90-30 = 60 డిగ్రీలు
Q : ఒక లంబ కోణ త్రిభుజం లో రెండు కోణముల విలువలు సమానం అయినా ఆ కోణ విలువలు కనుగొనండి?
Ans : ఒక లంబ కోణ త్రిభుజం లో కోణముల మొత్తం 180 డిగ్రీలు.
లంబ కోణ త్రిభుజం లో ఒక లంబ కోణం ఉంటుంది.
90+A+A = 180
90+2A = 180
2A = 180-90 = 90
A = 90/2 = 45 degreelu