Types of Numbers in Telugu – సంఖ్యలలో రకాలు (2025)

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో సంఖ్యలలో రకాలు (types of numbers ) గురించి నేర్చుకోవచ్చు.

సంఖ్యలలో వివిధ రకాల సంఖ్యలు ఉన్నాయి. Natural numbers, whole numbers, integers, rational numbers, irrational numbers, real numbers, complex numbers, algebraic numbers మొదలైనవి.

ఒక్కో సంఖ్య రకం కోసం కింద వివరంగా తెలుసుకోవచ్చు.

Natural Numbers in Telugu – సహజ సంఖ్యలు

వీటిని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు.

వీటిని లెక్కించుటకు వాడుతారు కనుక వీటిని counting numbers అని కూడా అంటారు.

వీటిని ‘N’ చే చూసిస్తారు.

Natural Numbers (N) = {1, 2, 3, 4, ….. }

సున్నా సహజ సంఖ్య కాదు.

కనిష్ట సహజ సంఖ్య 1.

గరిష్ట సహజ సంఖ్య చెప్పలేము. ఇది అనంతము.

వీటిలో సరి సంఖ్యలు. (even numbers ), బేసి సంఖ్యలు (odd numbers ) ఉంటాయి.

సరి సంఖ్యలు = {2, 4, 6, …}

బేసి సంఖ్యలు = {1, 3, 5, …. }

Whole Numbers in Telugu – పుర్ణాంకాలు

వీటిని తెలుగులో పుర్ణాంకాలు అంటారు. వీటిని ‘W’ చే చూసిస్తారు.

సున్నా మరియు natural numbers ని Whole numbers అంటారు.

Whole Numbers (W) = {0, 1, 2, 3, …. }

కనిష్ట whole number 0.

గరిష్ట whole number చెప్పలేము. ఇది అనంతము.

Natural నెంబర్ కాని whole నెంబర్ 0.

natural numbers సమితి whole numbers సమితికి ఉప సమితి అవుతుంది.

Integers in Telugu – పూర్ణ సంఖ్యలు

వీటిని తెలుగులో పూర్ణ సంఖ్యలు అంటారు.

వీటిని Z చే సూచిస్తారు.

Integers (Z) = { ….. -2, -1, 0, 1, 2, …. }

కనిష్ట పూర్ణ సంఖ్య చెప్పలేము మరియు గరిష్ట పూర్ణ సంఖ్య కూడా చెప్పలేము. ఇవి అనంతము.

Natural numbers సమితి Integers సమితికి ఉప సమితి.

Whole numbers సమితి Integers సమితికి ఉప సమితి.

Rational Numbers in Telugu – అకరణీయ సంఖ్యలు

వీటిని తెలుగులో అకరణీయ సంఖ్యలు అంటారు.

వీటిని తెలుగులో Q చే సూచిస్తారు.

p/q రూపంలో వ్రాయగల సంఖ్యలను rational numbers అంటారు. ఇక్కడ p , q are belongs to Z.

1/3, 1/2, 4/5 లు rational numbers.

Irrational Numbers in Telugu – కరణీయ సంఖ్యలు

వీటిని తెలుగులో కరణీయ సంఖ్యలు అంటారు.

p/q రూపంలో వ్రాయలేని సంఖ్యలను Irrational Numbers అంటారు.

For example, root of 2 is an irrational number. root of 2 ని p/q రూపంలో వ్రాయలేము.

Real Numbers in Telugu – వాస్తవ సంఖ్యలు

వీటిని తెలుగులో వాస్తవ సంఖ్యలు అంటారు. వీటిని R చే చూసిస్తారు.

పైన చెప్పిన మొత్తం సంఖ్యల సమితిని Real Numbers అంటారు.

Complex Numbers in Telugu – సంకీర్ణ సంఖ్యలు

వీటిని తెలుగులో సంకీర్ణ సంఖ్యలు అంటారు. వీటిని C చే చూసిస్తారు.

ఒక ఋణ సంఖ్యాకి వర్గ మూలం calculate చేసేటప్పుడు ఈ complex numbers వస్తాయి.

-1 యొక్క వర్గ మూలాన్ని i చే చూసిస్తారు.

సంకీర్ణ సంఖ్యలను a+ib అని కానీ (a,b) గా వ్రాస్తారు.

Conclusion

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి.

Click here to download this article as PDF ( No Ads )

ధన్యవాదములు.

WhatsApp Channel:
Telegram Channel:

1 thought on “Types of Numbers in Telugu – సంఖ్యలలో రకాలు (2025)”

  1. D.chinna mantru naik

    ఈ ఆర్టికాల్ చాలా బాగా ఉంది.lkg to pg maths మొత్తం topic wise అందివ్వగలరు.

Comments are closed.

Scroll to Top