Types of Sets in Telugu – సమితులలో రకాలు

WhatsApp Channel:
Telegram Channel:

ఈ రోజు ఆర్టికల్ లో Types of Sets కోసం డిస్కస్ చేసుకోవచ్చు. 

Set ని తెలుగులో సమితి అని అంటారు. 

Set అనేది collection of well defined elements. 

Set ని కాపిటల్ లెటర్స్ తో సూచిస్తారు. 

ఒక set లో ఉండే elements కౌంట్ ని Cardinal Number అని అంటారు. 

Natural Numbers N = {1, 2, 3, 4, … } ని set of Natural Numbers అని అంటారు. 

Sets ని మూడు రూపాలలో represent చేస్తారు. 

Roster Form, Statement Form and Set Builder Form. 

Types of Sets in Telugu – సమితులలో రకాలు 

సమితులలో మనకి వివిధ రకాల సమితులు ఉంటాయి. వాటి కోసం డిస్కస్ చేద్దాము. 

Empty Set : దీనిని తెలుగులో శూన్య సమితి అని అంటారు. 

ఇందులో ఎటువంటి elements ఉండవు. సున్నా elements ఉంటాయి. 

Cardinal Number of Empty Set = 0

దీనిని A = {} గ సూచిస్తారు. 

దీనిని Null Set అని కూడా అంటారు. 

Finite Set : ఈ సమితిలో limited elements ఉంటాయి. 

A = {4, 5, 6, 7}   Cardinal Number = 4

B = {a, e, i, o, u} Cardinal Number = 5

C = {a, b, c, d, e, f, g} Cardinal Number = 7

Infinite Set: ఈ సమితిలో Infinite elements ఉంటాయి. 

All natural numbers N = {1, 2, 3, 4, … }

All Whole Numbers W = {0, 1, 2, 3, … }

Equal Sets: 

A , B లు రెండు sets అయిన A యొక్క Cardinal Number మరియు B యొక్క Cardinal నెంబర్ సమానంగా ఉంటే ఆ సమితులను Equal Sets అని అంటారు. 

n(A) = n(B)

రెండు సమితులలో ఉండే elements కౌంట్ సమానంగా ఉంటాయి. 

A = {4, 6, 7}

B ={ c, d, g}

Set A = Set B

n(A) = n(B) = 3

Sub Set: దీనిని తెలుగులో ఉప సమితి అని అంటారు. 

A , B లు రెండు సమితులు అయినా Set A లో ఉండే elements అన్ని Set B లో ఉంటే అప్పుడు Set A ను Set B కు ఉప సమితి అని అంటారు. 

B = {1, 2, 3, 4, 5, 6, 7, 8}

A = {2, 4}

ప్రతి Set దానికదే Subset అవుతుంది. 

Universal Set: దీనిని తెలుగులో విశ్వ సమితి అని అంటారు. 

దీనిని U చే సూచిస్తారు. 

ఒక venn diagram లో ఉండే సమితులలో ఉండే elements అన్ని విశ్వ సమితిలో ఉంటాయి. 

A = {1, 2, 3} 

B = { a, b, c}

C = {A, B, C} 

Universal Set U = {1, 2, 3, a, b, c, A, B, C}

Sets A, B, C లు U కి ఉప సమితులు. 

Null Set అనునది విశ్వ సమితికి ఉప సమితి అవుతుంది. 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను. 

మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. 

WhatsApp Channel:
Telegram Channel:
Scroll to Top